తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్ లో వినియోగంలోకి నూతన గ్యాస్ దహన వాటిక - కరీంనగర్ కరోనా వార్తలు

కరోనాతో మరణాలు పెరుగుతుండటంతో నగరంలో నూతన గ్యాస్ దహన వాటికను వినియోగంలోకి తీసుకొచ్చారు. మరొకటి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మేయర్ తెలిపారు. 35 నిముషాల్లో ఒక్కో మృతదేహానికి దహన ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు.

gas combustion inkarimnager
కరీంనగర్ లో వినియోగంలోకి నూతన గ్యాస్ దహన వాటిక

By

Published : May 23, 2021, 8:08 PM IST

కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నూతన గ్యాస్ దహన వాటికను అధికారులు వినియోగంలోకి తీసుకొచ్చారు. కరోనా వల్ల మరణాలు పెరిగిన తరుణంలో శవ దహనాలు పెరిగాయి. దాదాపు రూ.25 లక్షల వ్యయంతో మార్కండేయ కాలనీ స్మశాన వాటికలో దీనిని ఏర్పాటు చేశారు. ఒక్కో శవ దహనానికి ఒకటిన్నర గ్యాస్ సిలిండర్ వినియోగించనున్నారు. దాదాపు 35 నిముషాల్లో ఒక్కో శవ దహన ప్రక్రియ పూర్తి అవుతుందని మేయర్ సునీల్ రావు వెల్లడించారు.

మరొకటి ఏర్పాటు చేస్తాం...

రాష్ట్ర ప్రభుత్వ సూచనతో యుద్ధ ప్రాతిపదికన దహన వాటికను ఏర్పాటు చేశామని.. మరొకటి మానేరు తీరాన ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ తెలిపారు. దహన అనంతరం శుభ్రపరచడం, అస్థికలు భద్రపరచడం లాంటి సేవలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. శవ దహనానికి ఆహార భద్రత కార్డుదారులకు రూ.2 వేలు, ఇతరులకు రూ.3 వేలు ఛార్జీ చేయనున్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తి దహనంతో దహన వాటిక సేవలు మొదలయ్యాయి.

ఇదీ చూడండి: పొంచి ఉన్న 'యాస్​' ముప్పు- అధికారులు అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details