కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి గ్రామంలో ఉపాధి హామీ కింద పనులు చేసే 70 మంది కూలీలు ఉపాధిని కోల్పోయారు. తీగలగుట్టపల్లి.. కార్పొరేషన్లో భాగమవడం వల్ల కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని... వారికి వెంటనే పనులు ఇవ్వాలంటూ భాజపా నాయకురాలు భోగ పుష్పాలత జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఉపాధి హామీ కూలీలు - కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఉపాధి హామీ కూలీలు
కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి గ్రామాన్ని కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయగా.. అక్కడ ఉపాధి హామీ కింద పనులు చేసే 70 మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. వారందరికి తిరిగి ఉపాధి కల్పించాలని కోరుతూ భాజపా నాయకురాలు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు.
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఉపాధి హామీ కూలీలు
ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. తీగలగుట్టపల్లి కార్పొరేషన్లో విలీనమవ్వడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం స్పందించి.. తమకు తిరిగి ఉపాధి కల్పించాలని కూలీలు వేడుకున్నారు.