హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ల కోసం.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాము గత మూడు రోజులుగా నామినేషన్లు వేయడానికి వస్తుంటే.. కుంటి సాకులతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 70 మంది నామినేషన్ కోసం తరలిరాగా.. పెద్ద క్యూలో నిలబడ్డారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారా? బలపరిచేందుకు పది మందిని తీసుకువచ్చారా? అని యక్ష ప్రశ్నలతో అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అధికారులు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నామినేషన్ వేయవచ్చని ఎవరిని అడ్డుకోబోమన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ వేయవచ్చని సూచించారు.
ఇటీవలే హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election nomination)లో రోజుకు వేయి మందితో నామినేషన్లు వేయిస్తామని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ క్షేత్రసహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య తెలిపారు. 18 నెలల నుంచి తమను విధుల్లోకి తీసుకోకపోవడం వల్లే ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో.. ఫీల్డ్ అసిస్టెంట్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే.. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election nomination)లో రోజుకు వేయి మందితో నామినేషన్ వేయిస్తామని(Field Assistants) హెచ్చరించారు. అందులో భాగంగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఉపఎన్నిక వివరాలిలా...