తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబపోషణకు ప్రత్యామ్నాయాలు చూస్తున్న ఉద్యోగులు - employees problems

కరోనా మహమ్మారి ఉద్యోగుల జీవితాలను దెబ్బతీసింది. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఉద్యోగులు ఉపాధికోసం నానాతంటాలు పడే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ, ప్రైవేట్‌ ఉపాధ్యాయులు పరిస్థితి గందరగోళంగా తయారైంది. పూర్తిజీతాలు రాక ఆర్టీసీ ఉద్యోగులు, బడులు ప్రారంభం కాక... ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు.

employees-problems-in-after-lock-down
కుటుంబపోషణకు ప్రత్యామ్నాయాలు చూస్తున్న ఉద్యోగులు

By

Published : Aug 7, 2020, 8:36 AM IST

కుటుంబపోషణకు ప్రత్యామ్నాయాలు చూస్తున్న ఉద్యోగులు

దేశంలో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతున్నా.. కంటికి కనిపించని వైరస్ మాత్రం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా పూర్తిస్థాయిలో ప్రయాణికులు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం పలు సర్వీసులను రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ఉద్యోగులందరికీ విధులు లభించట్లేదు. పూర్తి వేతనం రాక... వారందరూ అల్లాడిపోతున్నారు. కుటుంబ పోషణ కోసం విధిలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు.

అప్పుడు అలా...

ఈ క్రమంలోనే కొందరు కులవృత్తుల బాటపడుతున్నారు. ఓ ఆర్టీసీ డ్రైవర్‌... ఇస్త్రీ దుకాణం ప్రారంభించాడు. ఐతే కరోనా ప్రభావంతో అందులోనూ అనుకున్న మేర ఆదాయం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతానికి విధులు లేక సెలవులు పెట్టుకుంటున్నామని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. సెలవులు అయిపోయాక ఏమి చేయాలో అర్థం కావడం లేదని చెబుతున్నారు.

ప్రత్యామ్నాయాలు...

పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై స్పష్టత లేక ప్రైవేట్‌ ఉపాధ్యాయుల జీవితాలు ఆగమ్యగోచరంగా తయారయ్యాయి. బడులు మొదలు కాక... యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడం వల్ల ఏం చేయాలో పాలుపోక... చాలామంది ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కొంతమంది టిఫిన్ సెంటర్లు ప్రారంభిస్తే... మరికొంతమంది కూలీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.

కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:కొవిడ్ నుంచి ఎలుకలను రక్షించిన మోడెర్నా టీకా

ABOUT THE AUTHOR

...view details