కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగులు పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 2020 విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుందని జేఏసీ నాయకులు మండిపడ్డారు.
విద్యుత్ ఉద్యోగుల నిరసన - కరీంనగర్ జిల్లా వార్తలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 2020 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కరీంనగర్లోని ఎస్ఈ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్వంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. బిల్లును ఉపసంహరించుకోవాలంటూ.. నినాదాలు చేశారు.

విద్యుత్ ఉద్యోగుల నిరసన
విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కోసమే ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశ్యమని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. పేదలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులే కాకుండా.. ప్రతి ఒక్కరు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని విద్యుత్ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా