Electric Bike Explosion : ఛార్జింగ్‌కు పెట్టిన విద్యుత్తు ద్విచక్ర వాహనంలోని బ్యాటరీ పేలిపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. రామచంద్రాపూర్‌కు చెందిన ఎగుర్ల ఓదేలు తన ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయారు. అర్ధరాత్రి బ్యాటరీ పేలడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. నిద్రిస్తున్న వారంతా అప్రమత్తమై మంటలను అదుపు చేశారు.
Electric Bike Explosion : ఛార్జింగ్ అవుతుండగా పేలిన మరో ఎలక్ట్రిక్ బైక్ - Electric Bike blast in karimnagar
Electric Bike Explosion : రాష్ట్రంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే ఇలాంటి ఘటనలు వాటిని కొనుగోలు చేయాలనుకున్న మిగతా వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Electric Bike Explosion
పదకొండు నెలల కిందట కొనుగోలు చేసిన బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నిత్యం ఉపయోగిస్తున్నామని, మరో నెల పాటు వారంటీ ఉందని బాధితుడు తెలిపారు. సంబంధిత కంపెనీ యాజమాన్యం బాధితునికి కొత్త వాహనాన్ని అందజేసింది.