దిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే అక్కడ కాలుష్య ఇబ్బందులు ఎదురయ్యే ప్రసక్తే ఉండేది కాదని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో బ్యాటరీతో నడిచే ఆటోలు, వాహనాల సేవల యాప్ ఈయానా యాప్‌ను ప్రారంభించారు. మొదట్లో సీఎం కేసీఆర్ హరితహారం ప్రారంభిస్తే చాలా మంది విమర్శలు చేశారని.. ఇదే తరహా దిల్లీలో కూడా హరితహారం చేపడితే ప్రస్తుత పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు.
విద్యుత్ వాహనాలతో... ట్యాక్సీ సేవలు - విద్యుత్ వాహనాలతో... ట్యాక్సీ సేవలు
కరీంనగర్ ఆకర్షణీయ నగరాల్లో చేరిన క్రమంలో కాలుష్యరహిత నగరంగా చేయటమే లక్ష్యంగా పట్టణంలో బ్యాటరీతో నడిచే ఆటో, వాహనాల ఈ-యానా యాప్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

విద్యుత్ వాహనాలతో... ట్యాక్సీ సేవలు
ఈ యానా యాప్ ద్వారా నగరంలో ఎక్కడి నుంచైనా రవాణా సదుపాయం పొందేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. ప్లేస్టోర్‌తో పాటు యాప్‌స్టోర్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని సేవలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
విద్యుత్ వాహనాలతో... ట్యాక్సీ సేవలు
ఇదీ చూడండి: భార్య ఫిర్యాదు.. ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్