రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. గెలిచే పార్టీ తెరాసనేనని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాల విభజనకు పూర్వం ఏ సొసైటీలు ఉన్నాయో.. అవే సొసైటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయని.. కొత్త సొసైటీలు లేవని స్పష్టం చేశారు.
ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే: మంత్రి ఈటల - updated news on Elections are not about winning: Minister eetala
ఎన్నికలు ఏవైనా..గెలుపు తెరాసదేనని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే: మంత్రి ఈటల
ఎన్నికల్లో పోటీ ఉండటం సహజమని.. ఇందుకోసం సొసైటీల వారీగా సమీక్షలు జరుపుకుంటామన్నారు. ఈ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా ఛైర్మన్ ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. రెబల్స్ బెడద లేకుండా సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక చేయటం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న 11 సొసైటీల్లోనూ తెరాస జెండా ఎగరడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఇవీచూడండి:మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!