లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెరాస అధినేత తొలి బహిరంగ సభను కరీంనగర్‌లో నిర్వహించనున్నారు. సభా ప్రాంగణాన్ని మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.
ప్రజలను సభకు తరలించేందుకు గట్టి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రులు సూచించారు. ఈనెల 17న సాయంత్రం 6గంటలకు కేసీఆర్ రానున్నందున ప్రజలు 5గంటలలోపే సభాప్రాంగణానికి చేరుకోవాలని ఈటల కోరారు.సభా స్థలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులను మంత్రులు ఆదేశించారు.
పోరుగడ్డ నుంచే కేసీఆర్ ప్రచారం షురూ
తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరుగడ్డ కరీంనగర్ కు ప్రత్యేక స్థానం ఉంది. తెరాస ఆవిర్భావం తర్వాత కరీంనగర్లోనే తొలి బహిరంగసభ జరిగింది. కేసీఆర్ కరీంనగర్ ను సెంటిమెంట్ గా భావిస్తారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడినుంచే ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు గులాబీ బాస్.
ప్రజలను సభకు తరలించేందుకు గట్టి కృషి చేయాలి : ఈటల
ఇవీ చదవండి :సార్వత్రికం కోసం నారీభేరీ...!