కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మాజీమంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని సందర్శించారు. వాకింగ్ చేసేందుకు వచ్చిన వారితో, స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ETELA RAJENDER: జమ్మికుంటలో ఈటల రాజేందర్ పర్యటన - మార్నింగ్ వాకర్స్‌తో ముచ్చటించిన మాజీమంత్రి ఈటల
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని మాజీమంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. మార్నింగ్ వాకర్స్, స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు.

జమ్మికంటలో ఈటల రాజేందర్ పర్యటన
కళాశాల మైదానం వద్ద ఉన్న ఓపెన్ జిమ్‌ను పరిశీలించారు. జిమ్ పరికరాలను చూశారు. కాసేపు ప్రజలతో పాటు ఆయన కూడా జిమ్ చేశారు. అనంతరం స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.
ఇదీ చూడండి:భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు సబ్ కమిటీ ఆమోదం
Last Updated : Jun 30, 2021, 5:22 PM IST