తెలంగాణ

telangana

ETV Bharat / state

EETELA RAJENDER: తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటం నడుస్తోంది - telangana top news

తన ఒక్కడిని ఓడించేందుకు.. తెరాస ప్రభుత్వం ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని భాజపా నేత ఈటల రాజేందర్‌ తెలిపారు. సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసిన హుజూరాబాద్‌ ప్రజల ప్రేమ తనపై ఏనాటికీ తగ్గదని ధీమా వ్యక్తం చేశారు.

eetela-rajender-fires-on-cm-kcr
'మీరేం చేసినా ప్రజలు గెలిపించేది నన్నే'

By

Published : Aug 30, 2021, 10:25 AM IST

హుజూరాబాద్‌ ప్రజలు ఇచ్చే తీర్పు కోసం యావత్‌ తెలంగాణ ఆసక్తిగా ఎదురచూస్తోందని భాజపా నేత ఈటల రాజేందర్‌ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రాచపల్లిలో వివిధ పార్టీల నుంచి భాజపాలో ఈటల సమక్షంలో చేరారు. ప్రభుత్వం పథకాల రూపంలో ఇచ్చే ప్రతీ పైసా ప్రజలు చెల్లించే పన్నుల నుంచే ఖర్చు చేస్తారని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

'మీరేం చేసినా ప్రజలు గెలిపించేది నన్నే'

కేవలం సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు... మన సమస్య ఆత్మగౌరవ సమస్య కూడా ఇవాళ. బ్రిటీషోడు కూడా పాలించిండు గొప్పగా. కానీ మా పాలన మాకు కావాలని చెప్పి కొట్లాడినం. ఆంధ్రా వాళ్లు కూడా ఇస్తా అన్నరు డబ్బులు. కానీ మా స్వయంపాలన కావాలని కొట్లాడినం. ఇక్కడ కూడా.. ఇక్కడ కూడా రేపు కొట్లాడేది మనకు ఆత్మగౌరవం కావాలని చెప్పి కొట్లాడుతున్నం గుర్తుపెట్టుకో. ఇవాళ నేనందర్నీ... ఏమిచ్చినా తీస్కోండి నేనొద్దనట్లే. వాళ్ల సొంత పైసలు కాదు సుమా. కేసీఆర్​ కూలీ చేసిచ్చిన పైసలు కాదు. కేసీఆర్ కుటుంబ ఆస్తిని అమ్మిచ్చిన పైసలు కాదు. అది మన పైసలు గుర్తుపెట్టుకో. పన్నులు కడ్తే సర్కారుకు పైసలైతయ్. నీ సొమ్ముతో వాళ్లు సోకు చేస్తున్నరు సుమా.. వాళ్ల సొమ్ముతో మీరు సోకు చేస్తలే. మీకొచ్చే పెన్షన్, మీకొచ్చే ఆరోగ్య శ్రీ.. మీకొచ్చే రేషన్ కార్డ్.. మీకొచ్చే దళితబంధు, మీకొచ్చే రైతుబీమా... ఇవన్నీ మన పైసలనే విషయం మర్చిపోకండి.

కులం పంచాయితీ కాదు ఇవాళ్టి మన పంచాయితీ. కేసీఆర్ అహంకారం మీద దెబ్బకొట్టే పంచాయితీ... గుర్తుపెట్టుకోండి. నాలాంటి బంగపడ్డ బిడ్డమీద, దుర్మార్గపు కుట్ర జరిగిన బిడ్డ గెలుస్తదా మీరివాల తేల్చాల్సిన అవసరముంది. నా ఒక్కడి మీద వెయ్యి కోట్ల రూపాయలీరోజు ఖర్చు పెట్టి.. నా బొందుగ పిసకాలనే ప్రయత్నం జరుగుతా ఉంది. నన్ను కాపాడుకుంటరా.. లేదా అనేది మీ చేతిల్లోనే ఉంటది.

-ఈటలరాజేందర్, భాజపా నాయకుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో స్వయం పాలన కోసం కొట్లాడామని... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నామని అన్నారు. సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసిన హుజూరాబాద్‌ ప్రజల ప్రేమ ఏనాటికీ తగ్గదని రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:BANDI SANJAY: '2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం'

ABOUT THE AUTHOR

...view details