వెయ్యి కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చుతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఎండాకాలంలోపు ఉమ్మడి జిల్లాలో 160 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక ఏ ఒక్క రైతు కూడా తమకు నీళ్లు లేవనే పరిస్థితి లేదన్నారు.
త్వరలో చెక్ డ్యామ్‌ల నిర్మాణం: ఈటల - ఈటల రాజేందర్
ఈ ఎండాకాలంలోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 160 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ సమీక్ష వివరాలను మంత్రులు ఈటల, గంగుల, కొప్పుల మీడియాకు వివరించారు.
![త్వరలో చెక్ డ్యామ్‌ల నిర్మాణం: ఈటల Helth Minister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6060812-thumbnail-3x2-ta.jpg)
ఈటల రాజేందర్
చెక్‌డ్యామ్‌ల నిర్మాణం తర్వాత రివర్ ఫ్రంట్ కట్టాలన్నది తమ ఆలోచనగా వివరించారు. దాదాపు 800 ఎకరాల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారని ఈటల తెలిపారు.
ఈటల రాజేందర్
ఇదీ చూడండి :కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!