Rajendar allegations against KCR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మద్యం ద్వారా కేవలం రూ.10 వేల 7 వందల కోట్లు వస్తే ఇప్పుడు రూ.45 వేల కోట్లు సమకూర్చుకుంటుందని మాజీ మంత్రి, హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి పాలక్గా నియమితులైన హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ మూడు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ నగరానికి చేరుకున్నారు.
వరంగల్ నగరంలోని రంగ శయపేట నుంచి ర్యాలీ నిర్వహించి ఉరుసు, కరీమాబాద్ ప్రాంతంలో పలుచోట్ల పార్టీ జెండా ఎగరవేసి పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో 18 వాటిలో అధికారంలో ఉందని కావాలని కొంతమంది మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని, పెన్షన్ల పేరుతో ప్రతి సంవత్సరం రూ. 9వేల కోట్లు కల్యాణ లక్ష్మి చెక్కుల పేరుతో రూ. 2 వేల కోట్లు, రైతుబంధు ద్వారా రూ. 9 వేల కోట్లు ఇచ్చి మద్యం ద్వారా రూ.45 వేల కోట్లు దోచుకెళ్తున్నారని ఆరోపించారు.