కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లు అందరికీ జీతాలివ్వాలని డీవైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. డీఈవో కార్యాలయంలో డీఈవో రాజ్యలక్ష్మికి డీవైఎఫ్ఐ నేతలు వినతిపత్రం సమర్పించారు.
'లాక్డౌన్లో పనిచేసిన లెక్చరర్లకు జీతాలివ్వాలి'
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినా జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లందరికీ జీతాలివ్వాలని కోరుతూ కరీంనగర్ డీఈవోకు డీవైఎఫ్ఐ నేతలు వినతిపత్రం అందజేశారు.
'లాక్డౌన్లో పనిచేసిన లెక్చరర్లకు జీతాలివ్వాలి'
పది- ఇరవై ఏళ్ల నుంచి కళాశాలలనే నమ్ముకుని విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు ఇప్పించేలా చూడాలని డీఈవోను కోరారు. లాక్డౌన్ కాలంలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు.. కొందరు లెక్చరర్లను తీసివేసిందని... వారందరినీ తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు.