ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో రావణదహనం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికైన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 30 అడుగుల రావణుడి బొమ్మను దహనం చేశారు.
కరీంనగర్లో ఘనంగా దసరా వేడుకలు - తెలంగాణలో దసరా వేడుకలు
విజయదశమి పర్వదినాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. నవరాత్రి వేడుకల శోభతో నగరం అలరారింది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా రావణుడి బొమ్మను దహనం చేశారు.
కరీంనగర్లో ఘనంగా దసరా వేడుకలు... రావణ దహనం
కరీంనగర్లో ప్రతి ఆదివారం ఆహ్లాదాన్ని పంచే విధంగా వినోదాత్మక కార్యక్రమాలను నగరంలో ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం చేపట్టనున్నట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు.
ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా దసరా సంబరం, రావణ దహనం