కరోనా నిబంధనలు పాటిస్తూ కరీంనగర్లో విజయదశమి వేడుకలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని వివేకానందపురి కాలనీ వాసులు చౌరస్తాలో జమ్మి చెట్టును ఏర్పాటు చేసి శమీ పూజలు చేశారు. ఆ తర్వాత శమీ శమయతే పాపం శమి శత్రు వినాశిని.. అర్జునన్య ధనుదారి రామస్య ప్రియదర్శిని శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టును పూజించారు.
కరీంనగర్లో నిరాడంబరంగా విజయదశమి వేడుకలు - విజయదశమి వేడుకలు కరీంనగర్
దసరా వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి వల్ల నిరాడంబరంగా జరిగాయి. భక్తులు జమ్మి చెట్టుకు శమీ పూజ చేశారు. ఈ దసరాతో కొవిడ్ నాశనమైపోవాలని అమ్మవారిని వేడుకున్నారు.
కరీంనగర్లో నిరాడంబరంగా విజయదశమి వేడుకలు
కాలనీవాసులంతా కలిసి శమీ పూజలో పాల్గొని జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేశారు. ఈ దసరాతో కరోనా మహమ్మారి నాశనమైపోవాలని అమ్మవారిని మొక్కుకున్నారు.