కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం ముందు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులు మదుపు చేసుకున్న జనరల్ ప్రావిడెడ్ ఫండ్ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తూ... ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కొంత కాలంగా జీపీఎఫ్ డబ్బులు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ కావడం లేదని ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఘువీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్ల సమయంలో, వైద్యం కోసం విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. జీపీఎఫ్ సొమ్ము సక్రమంగా వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ జడ్పీ ముందు డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా - dtf protest before karimnagar zp
ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెండ్ ఫండ్ నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. జీపీఎఫ్ సొమ్ము ఉపాధ్యాయుల ఖాతాల్లో సక్రమంగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![కరీంనగర్ జడ్పీ ముందు డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4710767-thumbnail-3x2-dtf.jpg)
కరీంనగర్ జడ్పీ ముందు డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
కరీంనగర్ జడ్పీ ముందు డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా