తెలంగాణ

telangana

ETV Bharat / state

'24 గంటలు తాగునీరు అందించే దిశగా అడుగులు వేస్తున్నాం' - driniking water to be available everyday in karimngar

కరీంనగర్​ నగరపాలక సంస్థ మిషన్​ భగీరథ పథకంలో భాగంగా ప్రతిరోజు తాగునీటి సరఫరాను అమలు చేస్తోంది. ప్రతిరోజు తాగునీరు సరఫరా మిషన్​ భగీరథ వల్లే సాధ్యమైందని మేయర్​ సునీల్​రావు తెలిపారు. త్వరలోనే 24గంటలు తాగునీరు సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

driniking water to be available everyday in karimngar
'24 గంటలు తాగునీరు అందించే దిశగా అడుగులు వేస్తున్నాం'

By

Published : Aug 21, 2020, 5:06 PM IST

రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ మిషన్ భగీరథ పథకంలో ప్రతిరోజు తాగునీటి అమలు చేస్తోంది. దాదాపు 108కోట్ల రూపాయలతో కొత్తగా పైప్‌లైన్ల నిర్మాణంతో పాటు ఓవర్‌ హెడ్‌ట్యాంకులను నిర్మించడంతో తాగునీటి సరఫరా అమల్లోకి వచ్చింది. రాబోయే 30ఏళ్లలో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని పథకాన్నిరూపొందించారు. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 60వేల నల్లా కనెక్షన్లు ఉన్న కరీంనగర్‌ నగరంలో ప్రతిరోజు తాగు నీరు సరఫరా చేయాలని దశాబ్దాలుగా ఎదురు చూసినప్పటికి కేవలం మిషన్ భగీరథ వల్లనే సాధ్యమైందని మేయర్ సునీల్ రావు తెలిపారు.

గతంలో బోర్ల నుంచి నీటిని ట్యాంకులకు తరలించి అక్కడి నుంచి ఇళ్లకు సరఫరా చేసేవారమని ప్రస్తుతం వర్షపు నీటిని శుద్ది చేసి ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రస్తుతం ప్రతిరోజు నీటి సరఫరా కొనసాగుతోందని త్వరలోనే 24గంటలు తాగునీరు సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు మేయర్‌ సునీల్ రావు తెలిపారు.

ఇవీ చూడండి: అలీసాగర్ జలాశయం నుంచి నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details