తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధిహామీ పథకం పనులను పరిశీలించిన డీఆర్​డీవో పీడీ - తెలంగాణ తాజా వార్తలు

రామడుగు మండలం వెదిరలో డీఆర్​డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలత రెడ్డి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి పథకం పనులను పరిశీలించారు.

Telangana news
పీడీ ఉపాధి పనుల పరిశీలన

By

Published : May 20, 2021, 2:12 PM IST

కరీంనగర్ జిల్లా వెదిరలో డీఆర్​డీవో పీడీ శ్రీలత రెడ్డి పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలకు సకాలంలో డబ్బుల చెల్లింపు చేస్తున్నారో లేదో వాకబు చేశారు. జాబ్ కార్డు కలిగిన వారంతా ఉపాధి పనులు చేసుకోవాలని సూచించారు. లాక్​డౌన్ విధించినా ఉపాధి హామీ పథకం పనులను ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.

రోజుకు రూ.190 చెల్లింపునకు నిర్ణీత కొలతల ప్రకారం చేపట్టాలన్నారు. దీనికి ప్రభుత్వం అదనంగా 55 రూపాయలు చెల్లిస్తుందన్నారు. గ్రామాల్లో కొత్తగా కూలీల నమోదు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

ఇదీ చూడండి:స్థిరాస్తి రంగంపై రెండో దశ కరోనా ప్రభావం

ABOUT THE AUTHOR

...view details