డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్. బాబాసాహెబ్ 130వ జయంతిని పురస్కరించుకొని.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు.
దేశం గర్వించదగ్గ వ్యక్తి అయిన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగానే.. రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివరించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ పుట్టిన గడ్డపై.. తానూ పుట్టడం ఎంతో అదృష్టమన్నారు.