తెలంగాణ

telangana

ETV Bharat / state

భయపడొద్దు.. రాష్ట్రంలో కరోనా బాధితులు లేరు : మంత్రి ఈటల - corona virus news today

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి బాధితులు లేరని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే ఆ లక్షణాలపై 60-70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. హుజూరాబాద్​లో మంత్రి ఈటల రాజేందర్ కరోనా వైరస్ గురించి ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

Don't be afraid no one corona victims in the telangana state minister etela rajender
భయపడొద్దు.. రాష్ట్రంలో కరోనా బాధితులు లేరు : మంత్రి ఈటల

By

Published : Feb 8, 2020, 3:00 PM IST

కరోనా వైరస్​పై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో మంత్రి ఈటల రాజేందర్ ఈటీవీ భారత్​తో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి బాధితులు లేరని మంత్రి అన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే ఆ లక్షణాలపై 60-70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రిల్లో ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఈ వైరస్‌పై మా శాఖ ఎప్పటికప్పడు ప్రకటన విడుదల చేస్తోందన్నారు. వైరస్‌ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారన్నారు. కరోనా వైరస్‌ సాధారణంగా జలుబు లక్షణాలను కలిగి ఉంటుందన్నారు. అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్​తో ఇప్పటికే ఆ దేశంలో 760 మరణానికి కారణమైందన్నారు. 26 దేశాలకు వ్యాపించిదన్నారు. భారత ప్రభుత్వం వూహాన్‌ నగరంలో ఉన్న 700 మందిని రెండు ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి తీసుకొచ్చి ఐసోలేటేడ్‌ వార్డల్లో పరీక్షలు జరిపారని, ఎక్కడా కూడ పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదన్నారు.

భయపడొద్దు.. రాష్ట్రంలో కరోనా బాధితులు లేరు : మంత్రి ఈటల

ఇదీ చూడండి :మేడారం జాతరకు వెళ్లొచ్చేలోపు ఇళ్లు గుల్ల

ABOUT THE AUTHOR

...view details