సంతోషంగా ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై ఓ కుక్క దాడి చేయగా అతని ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన బట్టు రాజు కుమారుడు హర్షవర్ధన్ (2) ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్క దాడికి పాల్పడింది. ఇదీ గమనించిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.