తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య' - 'వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య'

ఉస్మానియా వైద్యులపై జరిగిన దాడులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ రెడ్డి ఖండించారు.

doctor vijayender reddy
'వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య'

By

Published : Apr 15, 2020, 5:40 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ... వైద్యులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రోగులకు సపర్యలు చేస్తుంటే... కొందరు మూర్ఖులు వైద్యులపై దాడులు చేయడం అమానుషమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉస్మానియాలో వైద్యులపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వైద్యులు రోగుల కోసం తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సపర్యలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటివి జరగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కొవిడ్-19 రోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇవీ చూడండి:లాక్​డౌన్​ వేళ... ఆదుకున్న వారికి అండగా...

ABOUT THE AUTHOR

...view details