తెలంగాణ

telangana

ETV Bharat / state

సౌకర్యాలు కల్పించకుండా సెల్ఫీ పెట్టడాన్ని రాద్ధాంతం చేస్తారా ?:పొన్నం

కొవిడ్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందిని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించకుండా.. కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సౌకర్యాలు కల్పించకుండా సెల్ఫీ పెట్టడాన్ని రాద్ధాంతం చేస్తారా ?:పొన్నం
సౌకర్యాలు కల్పించకుండా సెల్ఫీ పెట్టడాన్ని రాద్ధాంతం చేస్తారా ?:పొన్నం

By

Published : Jun 30, 2020, 7:33 PM IST

రాష్ట్ర మంత్రులు చికెన్‌ కోసం వ్యాపార ప్రకటనలు ఇచ్చినట్లు కరోనా సోకిన వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్చి ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి నియంత్రణకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన విరాళాలు ఎన్ని.. ఎంత ఖర్చు చేశారు, ఎక్కడ ఖర్చు చేశారనే వివరాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నారని... అభివృద్ది చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రజలు కరోనా బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కేంద్ర బృందం వచ్చినా శూన్యమే..

రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్​ నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మూడు పర్యాయాలు కేంద్రబృందం రాష్ట్రానికి వచ్చినా ఒరిగింది శూన్యమేనని పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. తమకు సరైన వైద్యం అందట్లేదని.. సెల్ఫీ వీడియోలు పెడుతుంటే లోపాలు సరిచేయాల్సిన ప్రభుత్వం అలా వీడియోలు పెట్టవచ్చా అని వితండవాదానికి దిగుతోందని పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి : కరోనా వ్యాక్సినేషన్​కు మోదీ చతుర్భుజ ప్రణాళిక.

ABOUT THE AUTHOR

...view details