దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతోన్న ఎన్నికల ప్రచారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. భాజపాను తెరాస ఎదుర్కోలేకనే అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కరీంనగర్లో దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను పరామర్శించారు.
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం: డీకే అరుణ
కరీంనగర్లో దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కలిశారు. సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని విమర్శించారు. భాజపాను తెరాస ఎదుర్కోలేకనే బురద జల్లుతోందని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికల్లో భాజపాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.
బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం: డీకే అరుణ
దుబ్బాక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుని నిరసిస్తూ కరీంనగర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి:దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట