కరీంనగర్జిల్లా వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు. దుకాణదారులు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు చేశారు. చిన్నారులు, పెద్దలు కలిసి టపాసులు పేల్చారు. సంవత్సరమంతా లక్ష్మీదేవి కటాక్షాలు మెండుగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.
చొప్పదండి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.