తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ జిల్లాలో ఉచితంగా మాస్కుల పంపిణీ - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు

వాలంటీర్స్ సోసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్​ జిల్లాలో ఉచితంగా ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరో ఆరు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Distribution of masks free of cost in Karimnagar
Distribution of masks free of cost in Karimnagar

By

Published : Apr 22, 2021, 4:13 PM IST

రిలయన్స్ ఫౌండేషన్ వారి సహకారంతో కరీంనగర్ జిల్లా వాలంటీర్స్ సోసైటీ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. కొత్తపల్లి పట్టణంలోని వీక్లి మార్కెట్​లో(అంగడి బజార్​) 300 మాస్కులను అందజేశారు. వీధి వ్యాపారులకు కరోనాపై అవగాహన కల్పించారు.

సంతకు వచ్చే ప్రజలు… కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మరో ఆరు వారాల పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ… మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details