తెలంగాణ

telangana

ETV Bharat / state

essentials Distribution: ఇటుక బట్టీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ - Distribution of essentials

కరీంనగర్‌ జిల్లా గట్టుబుత్కూరు గ్రామంలో ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన 60 ఇటుక బట్టీ కుటుంబాలకు ఆదరణ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు కర్రె పావని రవి నిత్యావసరాలు (essentials Distribution) అందజేశారు. లాక్​డౌన్(Lock down) కారణంగా ఇబ్బంది పడుతున్న అనేక మంది కూలీలకు​ ఇప్పటికే సాయం చేసినట్లు వారు పేర్కొన్నారు. సహాయం అందించాలనుకునేవారు ఈ ఫోన్‌ నంబర్‌ 76748 98928కు సంప్రదించాలని కోరారు.

essentials Distribution
ఇటుక బట్టీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Jun 4, 2021, 10:25 PM IST

ఒడిశా ఇటుక బట్టీ కార్మికులకు మనసున్న మారాజులు నిత్యావసర వస్తువులు పంపిణీ(essentials Distribution) చేశారు. కరీంనగర్‌ జిల్లా గట్టుబుత్కూరు గ్రామంలో ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన కుటుంబాలు 60 వరకు ఉన్నాయి. లాక్‌డౌన్(Lock down) కారణంగా నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో తాము వారికి సహాయం అందించినట్లు ఆదరణ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు కర్రె పావని రవి తెలిపారు. లాక్​డౌన్(Lock down) కారణంగా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని మధ్య తరగతి వలస కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందని వారు పేర్కొన్నారు.

ఇటుక బట్టీల్లో పని చేస్తున్న చాలా మంది కార్మికులకు పనులు దొరక్కపోవడంతో చాలామంది వలస కార్మికులు తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరో 10 రోజుల్లో మిగిలిన వారు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఉపాధి లేక తినడానికి ఇబ్బంది పడుతున్నారనే సమాచారంతో తాము నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. చాలా మంది మధ్య తరగతి కుటుంబీకులు, వలస కార్మికులు తమ సంస్థను ఆశ్రయిస్తున్నారని.. సహాయం అందించాలనుకునేవారు ఈ ఫోన్‌ నంబర్‌ 76748 98928కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:High Court: మరో శతాబ్దానికి సొమ్ము చెల్లిస్తారా: హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details