తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ పీఎస్‌గా జమ్మికుంట... అభినందించిన డీజీపీ - డీజీపీ మహేందర్ రెడ్డి వార్తలు

ఉత్తమ పీఎస్‌గా జమ్మికుంట ఠాణా ఎంపిక కావడంపై డీజీపీ మహేందర్​ రెడ్డి అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఉత్తమ ఠాణాలు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇతర ఠాణాల్లోనూ పౌరసేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుచేయాలని సూచించారు.

dgp-mahindra-reddy-appreciate-to-jammikunta-police-station
ఉత్తమ పీఎస్‌గా జమ్మికుంట... అభినందించిన డీజీపీ

By

Published : Dec 3, 2020, 2:27 PM IST

దేశంలోనే అత్యుత్తమ 10 పోలీస్ స్టేషన్లలో ఒకటిగా కరీంనగర్ కమిషనరేట్‌లోని జమ్మికుంట ఎంపిక కావడం పట్ల డీజీపీ మహేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర స్టేషన్లు ఉత్తమ పౌర సేవలు, స్నేహ పూర్వక పోలీసింగ్ అమలు చేయాలని డీజీపీ కోరారు.

పౌర సేవల విభాగంలో అత్యుత్తమ సేవలందించడం, పోలీస్ స్టేషన్ల మధ్య స్నేహపూర్వక పోటీ తత్వాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా 10 అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంపిక చేస్తుంది. ఈ ఏడాదికిగాను 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో జమ్మికుంటకు చోటు దక్కింది. కరీంనగర్ కమిషనరేట్‌ పరిధిలో రెండోసారి అరుదైన అవకాశం దక్కడం పట్ల పోలీస్‌ కమిషనర్ కమలహాసన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి.. స్టేషన్‌హౌస్ అధికారిని అభినందించారు. 2019 సంవత్సరంలో చొప్పదండి పోలీస్ స్టేషన్‌ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా 7వ స్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:కౌెంటింగ్​కు అంతా సిద్దం : ఓల్డ్‌ మలక్‌పేటలో సీపీ అంజనీకుమార్

ABOUT THE AUTHOR

...view details