అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, నవాబుపేట్, ఇందుర్తి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుందరిగిరిలో పలు సంఘాల కమ్యూనిటీ హాల్ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సుందరగిరిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్‌ను ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇందుర్తిలో గ్రామ పంచాయతీ భవనానికి, శ్మశాన వాటికకు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మండలంలో ఉన్న ఇతర సమస్యల గురించి తెలుసుకుని సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు.
చిగురుమామిడిలో అభివృద్ధికి శ్రీకారం - అభివృద్ధి పనులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు అభివృద్ధి పనులకు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
చిగురుమామిడిలో అభివృద్ధికి శ్రీకారం