కరీంనగర్లోని ప్రభుత్వ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. పదిహేనవ డివిజన్లో రూ. 40 లక్షలతో చేపట్టబోయే పార్కు పనులకు మేయర్... కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్ లక్ష్మితో కలిసి భూమి పూజ చేశారు.
'ప్రభుత్వ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాం' - Telangana news
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 15వ డివిజన్లో రూ. 40 లక్షలతో చేపట్టబోయే పార్కు పనులకు మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్ లక్ష్మి కలిసి భూమి పూజ చేశారు.

నాలుగున్నర కోట్లతో అభివృద్ధి పనులు: మేయర్
నగరంలో కొత్తగా రూ. నాలుగున్నర కోట్లతో పనులు చేపడతామని ఆయన అన్నారు. ప్రభుత్వ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే నగరపాలక సంస్థకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి:ఒక ఆలోచన + కాస్త ఓపిక = సరికొత్త స్థాపన!