తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలీస్​స్టేషన్​లను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తాం' - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

జిల్లాలోని పోలీస్​స్టేషన్​లను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కరీంనగర్​ పోలీస్​ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. చొప్పదండి మోడల్ పోలీస్​స్టేషన్​ను ఆయన పరిశీలించారు.

develop police stations at the corporate level cp kamalasan reddy
పోలీస్​స్టేషన్​లను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తాం

By

Published : Jan 17, 2021, 5:52 AM IST

జిల్లాలోని పోలీస్​స్టేషన్​లను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు... కరీంనగర్​ పోలీస్​ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. దీనికోసం రాష్ట్రప్రభుత్వం రూ.50లక్షలు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. చొప్పదండి మోడల్ పోలీస్​స్టేషన్​ను ఆయన పరిశీలించారు. మొదటి సారిగా సామాజిక భద్రతకు చొప్పదండి వ్యాపారులు ముందుకు రావటంతో... సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.

జిల్లాలో పది పోలీస్​స్టేషన్​లకు కార్పొరేట్ హంగులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. చొప్పదండిలో శిథిలావస్థకు చేరిన పోలీస్​స్టేషన్​ భవనాన్ని పునర్ నిర్మించిన తీరు, తాజాగా చేపట్టిన పనుల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన పార్కు, జిమ్, పిల్లల ఆట స్థలాన్ని కమిషనర్​ పరిశీలించారు.

ఇదీ చదవండి: నిర్మాణ రంగానికి ప్రభుత్వాలు ఏలాంటి సహకారం అందించాలి?

ABOUT THE AUTHOR

...view details