తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్‌ కిట్‌ పథకం అమల్లో ఎనలేని జాప్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరగాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌ పథకం అమల్లో జాప్యం జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలు కాన్పు కోసం వెళితే ఆర్థికంగా ఇబ్బంది పడతారన్న సదుద్దేశంతో ప్రవేశపెట్టిన పథకమే అయినప్పటీకి పంపిణీలో మాత్రం ఎనలేని అలసత్వం కనిపిస్తోంది. కిట్‌ పంపిణీ సక్రమంగా జరగకపోవడం వల్ల బాలింతల కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.

kcr kit
కేసీఆర్‌ కిట్‌ పథకం అమల్లో ఎనలేని జాప్యం

By

Published : Mar 28, 2021, 4:24 AM IST

కేసీఆర్‌ కిట్‌ పథకం అమల్లో ఎనలేని జాప్యం

బాలింతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం కొన్ని నెలలుగా కరీంనగర్​ సక్రమంగా అమలు కావడం లేదు. పెరుగుతున్న ప్రసవాల సంఖ్యకు అనుగుణంగా జిల్లాకు రావల్సిన కోటా రాకపోవడం వల్ల బాలింతలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిడ్డకు జన్మనిచ్చే రోజునే కిట్‌ను అందించాలనే లక్ష్యం క్రమంగా ఆలస్యం అవుతుండటం వల్ల సర్కార్ ఉద్దేశం నెరవేరడం లేదు. 2వేల విలువ చేసే కిట్‌లో దోమతెర, సబ్బులు, నూనెలు సహా 16 రకాల వస్తువులుంటాయి. వీటిని అందించే విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండటం వల్ల పేద కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడుతోంది.

పెరిగిన కాన్పులు

ప్రభుత్వం ప్రోత్సాహ నగదుతోపాటు కేసీఆర్‌ కిట్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి కాన్పులు పెరిగాయి. మగబిడ్డకు జన్మనిచ్చినవారికి 12వేల నగదు, ఆడపిల్ల పుట్టిన వారికి 13వేలు అందించడంలో ఆలస్యం జరుగుతోంది. ఏడాది కాలంగా 22,148 మందికి నగదు వారి ఖాతాల్లో పడాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 7,803 మందికి మాత్రం సొమ్మును అందించారు. ఇంకా 22వేలకుపైగా అర్హులు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 10కోట్లకుపైగా నిధులు విడుదల చేస్తే తప్ప ఇప్పటి వరకు కాన్పులు జరుపుకున్న వారికి ఆర్థిక సహాయం అందే పరిస్థితి లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా కరీంనగర్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకూ 9,839 ప్రసవాలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 8,839 కిట్లను మాత్రమే అందించారు. ఇంకా వెయ్యి మందిని ఈ కిట్ల కొరత వెంటాడుతోంది. చాలా సందర్భాల్లో కాన్పు జరిగిన మూడు నెలల తర్వాత కేసీఆర్‌ కిట్లు అందే పరిస్థితి నెలకొంది.

కేసీఆర్‌ కిట్ల విషయంలో.. ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. నిధులు రాగానే అర్హులందరికీ పంపిణీ చేస్తామంటున్నరు. కిట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details