కరీంనగర్ లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీగా పనిచేస్తున్న సంజీవ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా గుండె, కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. సంజీవ్‌కుమార్ రెండు సంవత్సరాల క్రితం డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సొంత గ్రామం వరంగల్ జిల్లా శాయంపేట. మొదటి సారిగా 1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లాలో ఎస్సైగా, సీఐగా విధులు నిర్వహించారు. అనంతరం హుజురాబాద్ డీఎస్పీగా, నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ డీసీపీగా పనిచేశారు.
డీసీపీ సంజీవ్‌కుమార్ మృతి
అనారోగ్య కారణాలతో కరీంనగర్ డీసీపీ సంజీవ్‌కుమార్ మరణించారు. గతకొంత కాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు.
డీసీపీ సంజీవ్‌కుమార్ మృతి