కరీంనగర్ పర్యటనలో భాగంగా కశ్మీర్ గడ్డలోని షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో బండారు దత్తాత్రేయ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ సంజయ్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహాత్మా గాంధీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని... అంబేడ్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని దేశానికి గొప్ప రాజ్యాంగం అందించారని విద్యార్థులకు దత్తాత్రేయ తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చదువు.. డిగ్రీల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడేలని అన్నారు. అనంతరం వసతి గృహ ఆవరణలో మొక్కలు నాటారు.
'చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి' - 'చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి'
మహనీయులను ఆదర్శంగా తీసుకొని మంచి విద్యావేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు.
'చదువు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి'