హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండో రోజు దళిత బంధు సర్వేను కొనసాగింది. దళిత బంధు సర్వేను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. దళిత బంధు పథకం దళితులందరికీ అందుతుందని స్పష్టం చేశారు. హుజూరాబాద్ అర్బన్‌లోని 15 వార్డు ఎస్డబ్ల్యూ కాలనీ, గాంధీనగర్ 29వ వార్డు, ఇందిరా నగర్ కాలనీ, ఎస్సీ కాలనీలోని దళిత కుటుంబాలను స్వయంగా కలిసి వారితో ముచ్చటించారు. కుటుంబంలోని సభ్యుల్ని పలకరిస్తూ వారి ఆర్థిక జీవన స్థితిగతుల్నిఅడిగి తెలుసుకున్నారు.
వారు ఎంపిక చేసుకున్న యూనిట్ల గురించి అడిగారు. దళిత బంధు ద్వారా అందే 10 లక్షల రూపాయలతో లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే సంఖ్యతో పాటు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్లు విధిగా నమోదు చేయాలని, సమగ్ర వివరాలను తీసుకోవాలని సర్వే బృందం అధికారులను ఆదేశించారు. దళిత బంధుతో ఆర్థికంగా ఎదిగి ధనవంతులు కావాలని, దళిత కుటుంబాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.