తెలంగాణ

telangana

ETV Bharat / state

Dalitha Bandhu: హుజూరాబాద్​లో మరోసారి ఇంటింటి సర్వే - కరీంనగర్​ వార్తలు

దరఖాస్తుల్లో తప్పిదాలను సవరిస్తూ... గతంలో నమోదుకాని కుటుంబాలకు అవకాశం కల్పించేలా.. అధికారులు దళితబంధు (Dalit Bandhu) లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. దళితబంధుపై అవగాహన సమావేశాలు సైతం నిర్వహిస్తూ... లబ్ధిదారుల ఆసక్తిని తెలుసుకుంటున్నారు.

Dalitha Bandhu
Dalitha Bandhu

By

Published : Sep 17, 2021, 8:27 AM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం ( Dalit Bandhu scheme ) లబ్ధిదారుల ఎంపికలో అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఇప్పటికే వారం రోజులపాటు సర్వే నిర్వహించి గుర్తించిన లబ్ధిదారుల దరఖాస్తుల్లో తప్పిదాలను సవరించడంతోపాటు, గతంలో నమోదుకాని కుటుంబాలకు అవకాశం కల్పించేలా బుధవారం మరోసారి ఇంటింటి సర్వే(Survey) నిర్వహించారు.

ఇందులో భాగంగా రేషన్‌కార్డు లేనివారి వివరాలను నమోదు చేయడంతోపాటు... స్థానికంగా లేని వారి పేర్లను గుర్తిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దళితబంధు సర్వే (Dalit Bandhu Survey)లో గుర్తించిన కుటుంబాల్లో ఇప్పటివరకు 14,400 మంది ఖాతాలలో రూ.10 లక్షల చొప్పున జమచేశారు. వారిలో డెయిరీ ఏర్పాటుకు ఎంతమంది ఆసక్తిని చూపిస్తున్నారనే విషయమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. దాదాపు 3,700 మంది ట్రాక్టర్లు కావాలని, మరో 3,500 మంది వరకు కార్లు కావాలని దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. వారికి ఏ యూనిట్‌ అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకునేలా దళిత మేధావులతో కలిసి గ్రామాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ (Center for Dalit Studies) ఛైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య (Mallepally Lakshmaiah) నేతృత్వంలో జమ్మికుంట, ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, చిన్నకోమటిపల్లిలో అవగాహన సమావేశాల్ని నిర్వహించి లబ్ధిదారుల ఆసక్తిని తెలుసుకున్నారు. ‘ఎంచుకున్న ఐదు రకాల యూనిట్‌ల ఏర్పాటులో లబ్ధిదారులకు ఉన్న కష్టనష్టాలు, ప్రయోజనాలను సర్వే సందర్భంగా గుర్తించి నివేదికను తయారు చేస్తామని’ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details