కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. దవాఖానాలో సదుపాయాలపై ఆరా తీశారు.
ప్రభుత్వం తప్పుడు నివేదికల వల్లే ప్రస్తుత పరిస్థితులు: బండి సంజయ్
కరోనా కేసులు, మరణాల పట్ల ప్రభుత్వ తప్పుడు నివేదికల వల్లే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి పెరిగిందని భాజపా రాష్ట్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. మొదటి నుంచి సరైన నివేదికలు ఇస్తే.. ప్రజల్లో నిర్లక్ష్యం తగ్గి జాగ్రత్తగా ఉండేవారని, ఫలితంగా ప్రస్తుత పరిస్థితులు వచ్చేవి కావని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం మొదటి నుంచి సరైన నివేదికలు ఇస్తే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని బండి సంజయ్ ఆరోపించారు. ఎంతమంది కొవిడ్ బారినపడ్డారు, వైరస్‌తో ఎంతమంది చనిపోతున్నారని సరైన సమాచారం ఇస్తే.. ప్రజల్లోనూ నిర్లక్ష్యం తగ్గి జాగ్రత్తగా ఉండేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రుల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉందని.. వైద్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా పర్మినెంట్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.