విద్యుత్ శాఖ సీఎండీ గోపాలరావు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ కరీంనగర్ టౌన్ ఏడీఈ అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో మంచి పేరున్న తనను తీవ్ర వేధింపులకు గురి చేయడం సబబు కాదన్నారు. గత వారం రోజులుగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నానని వాపోయారు. కేవలం ఎస్సీననే కారణంగానే ఇష్టమొచ్చినట్లుగా తిడుతున్నారని తెలిపారు. మూడేళ్ల నుంచి సైక్రియాట్రిస్ట్ దగ్గర చికిత్స పొందుతూ... రోజు మూడు మాత్రలు వేసుకుంటే తప్ప నిద్రపోలేకపోతున్నానని అశోక్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. వేధింపులు ఎక్కువైనందునే గోపాల్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు అశోక్ కుమార్ తెలిపారు.
'నేను ఎస్సీ కులానికి చెందినందుకే వేధిస్తున్నాడు' - AE
విద్యుత్ శాఖ సీఎండీ గోపాలరావు తనను మానసికంగా వేధిస్తున్నాడని కరీంనగర్ టౌన్ ఏడీఈ అశోక్ కుమార్ ఆరోపించారు. ఎస్సీ కులానికే చెందినందుకే తనను దూషిస్తున్నట్లు వివరించారు.

'నేను ఎస్సీ కులానికి చెందినందుకే తీవ్రంగా వేధిస్తున్నాడు'
'నేను ఎస్సీ కులానికి చెందినందుకే తీవ్రంగా వేధిస్తున్నాడు'
ఇవీ చూడండి: రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
Last Updated : May 17, 2019, 9:20 PM IST