ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రెండో విడతలో చొప్పదండితో పాటు రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లో ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. నాలుగు జడ్పీటీసీ స్థానాలు, 53 ఎంపీటీసీ స్థానాలకు తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపాలతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు. జడ్పీటీసీ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల స్వగ్రామాల్లో ప్రత్యర్థి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి బలమైన వ్యక్తి ఉండటం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశముందని భయపడుతున్నారు. పోలింగ్ సమయంలో రెండు బ్యాలెట్లు ఉండటం వల్ల ఓటర్లు తికమకపడే అవకాశం ఉందని అభ్యర్థులు సమాలోచన చేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ అంశాన్ని ముందే పసిగట్టిన అభ్యర్థులు ప్రచారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం - zptc
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. క్రాస్ ఓటింగ్ అంశాన్ని ముందే పసిగట్టిన అభ్యర్థులు ప్రచారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం