అకాల వర్షంతో అన్నదాతలకు అపార నష్టం - కరీంనగర్లో నీటిపాలైన ధాన్యం
ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా అకాల వర్షానికి తడిసిముద్దయింది. మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యం సరైన సదుపాయాల్లేక నీటి పాలైంది.

కరీంనగర్లో నీట మునిగిన ధాన్యం
కరీంనగర్ జిల్లా గంగాధరలో భారీ వర్షం రైతులను నట్టేట ముంచింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల తమ ధాన్యాన్ని యార్డుల్లోని ప్లాట్‌ఫామ్‌లపై కుప్పలుగా పోశారు. అరకొరగా ఉన్న టార్పాలిన్లు కప్పారు. గంట సేపు కురిసిన వానను టార్పాలిన్లు అడ్డుకోలేక పోయాయి. ధాన్యం మొత్తం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంటంతా కళ్లముందే నీటిపాలైందని రైతులు లబోదిబోమన్నారు.
కరీంనగర్లో నీట మునిగిన ధాన్యం
- ఇదీ చూడండి : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద