కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లెలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతల నీటి లీకేజీతో పొలాలు మునిగాయి. గత మూడు రోజుల నుంచి నీరు వృధాగా పోయి.. 100 ఎకరాలు సాగుచేస్తున్న పంట భూములు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 40 ఎకరాలకు సిద్ధం చేసుకున్న నారు ముళ్లు కూడా నీటిలో మునిగాయని రైతులు వాపోయారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు లీకేజీతో నీట మునిగిన పొలాలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతల నీటి లీకేజీతో పొలాలు మునిగిపోయాయి. గత మూడు రోజులుగా నీరు లీకై తమ పొలాలను ముంచేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. లీకేజీ కట్టడిచేసి తమ పంటలను కాపాడాలని వారు కోరుతున్నారు.
లీకేజీతో నీట మునిగిన పంట పొలాలు
నీటి సరఫరా నిలిపివేయాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను వేడుకున్నా.. స్పందించలేదని రైతులు ఆవేదన చెందారు. అవసరం లేకున్నా నీటి విడుదల చేయడంతో పొలాలు మునుగుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చూడండి:లైవ్ మర్డర్: సీసీ కెమెరాలో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ హత్య