తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షాలు.. అన్నదాతకు కష్టాలు.. ఇక ప్రభుత్వమే దిక్కు..

Crop Damage in Karimnagar: అకాల వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికందే పంట అడపా దడపా కురుస్తున్న వర్షాలకు నేలకొరుగుతోంది. యాసంగిలో ప్రభుత్వ ఆంక్షల వల్ల వరి వేయలేకపోయామని భావించిన రైతులు.. వానాకాలంలో పెద్ద ఎత్తున వరి పంట వేశారు. కానీ అకాల వర్షాల వల్ల తాము పడ్డ కష్టం అంతా వృథా అయిందని ఆవేదన చెందుతున్నారు.

అకాల వర్షాలు.. అన్నదాతకు కష్టాలు.. ఇక ప్రభుత్వమే దిక్కు..
అకాల వర్షాలు.. అన్నదాతకు కష్టాలు.. ఇక ప్రభుత్వమే దిక్కు..

By

Published : Oct 9, 2022, 7:03 AM IST

అకాల వర్షాలు.. అన్నదాతకు కష్టాలు.. ఇక ప్రభుత్వమే దిక్కు..

Crop Damage in Karimnagar: కరీంనగర్​ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి పంట నేలకొరిగింది. యాసంగిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో పెద్దగా ఆసక్తి చూపని రైతులు.. వానాకాలంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా అమ్ముకోవడానికి వీలు ఉంటుందని పెద్దఎత్తున వరి పంటలు వేసుకున్నారు. కానీ వర్షాల ప్రభావానికి చేతికి వచ్చే పంట నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల పెట్టుబడి సాయం ఇచ్చినా.. తమకు మాత్రం రూ.35 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.

గతంలో వర్షాల వల్ల నష్టం కలిగినప్పుడు అధికారులు తమకు జరిగిన నష్టాన్ని రాసుకొని వెళ్లేవారని.. ఇప్పుడు రైతుబంధు వచ్చాక తమను పట్టించుకునేవారు లేరని చెబుతున్నారు. నేలకొరిగిన పంటను కాపాడుకునేందుకు ఎంత యత్నించినా ప్రయోజనం ఉండదని.. ధాన్యం నాణ్యత దెబ్బతిని ధర కూడా పలకదని రైతులు అంటున్నారు. పంట నష్టపోవడంతో తాము పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. రైతుల పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details