శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూడడానికి బారెడు.. ఖర్చు మూరెడు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
బడ్జెట్ చూడడానికి బారెడు.. ఖర్చు మూరెడు: చాడ - తెలంగాణ వార్తలు
రాష్ట్ర బడ్జెట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంకెల గారడీగా ఉందని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారిందని ఆరోపించారు.
బడ్జెట్ చూడడానికి బారెడు.. ఖర్చు మూరెడు: చాడ
ఇది సమగ్రమైన బడ్జెట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక లోటును ఎలా పూడుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ విధివిధానాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఇదీ చదవండి:కనులవిందుగా బ్రహ్మోత్సవాలు.. హంసవాహనంపై నారసింహుడు