'జిల్లాలకు వారి పేర్లతోనే కేసీఆర్ మాటకు అర్థం' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ సాయుధ పోరాటయోధులు ముఖ్యపాత్ర పోషించారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. నూతన జిల్లాలకు సాయుధ అమరవీరుల పేర్లు పెట్టినప్పుడే ఆ మాటకు అర్థం ఉంటుందన్నారు.
'జిల్లాలకు వారి పేర్లతోనే కేసీఆర్ మాటకు అర్థం'
రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ సాయుధ వీరుల పాత్రపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు సాయుధ అమరవీరుల పేర్లు పెట్టినప్పుడే ఆయన మాటలకు అర్థముంటుందని పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలపై తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. నల్లమల అడవుల నాశనం... రాష్ట్ర వినాశనానికి నాంది అని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : కనీస వేతనాల కోసం కార్మికుల ఆందోళన బాట