కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని సర్వే నెంబర్ 55లో ఉన్న భూమిని రక్షించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిపల్లి రాజు కోరారు. ఈ భూమిని కబ్జా చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందించారు.
రేకుర్తిలో భూమిని రక్షించండి: సీపీఐ - కరీంనగర్ జిల్లా వార్తలు
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు పైడిపల్లి రాజు. రేకుర్తిలోని సర్వే నెంబర్ 55లో భూమిని రక్షించాలని కోరారు.

రేకుర్తిలో భూమిని రక్షించండి: సీపీఐ
వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భూమిని రక్షించకుంటే ఎర్రజెండా పాతుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్