కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై భారం మోపడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేద,మధ్య తరగతి ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా - కరీంనగర్ జిల్లా వార్తలు
కరీంనగర్ జిల్లా జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజలపై భారం మోపడం దుర్మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి విమర్శించారు. వెంటనే కేంద్ర సర్కారు ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం ధరలు పెంచుకుంటూ పోతుందని, దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి పడిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే ఇక్కడ పన్నుల మీద పన్నులు వేసి ప్రజల జేబులకు చిల్లులు పడే చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్