కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు భాజాపా పూర్తి బాధ్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకిస్తూ కరీంనగర్లో సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. నగరంలోని సీపీఐ భవనం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి - చాడ వెంకట్ రెడ్డి తాజా వార్తలు కరీంనగర్
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంతీరుతో రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ కరీంనగర్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలి: చాడ వెంకట్ రెడ్డి
రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెరాస రూ. 10 వేలు ఆశచూపిస్తోందని ఆరోపించారు. భాజపా బోగస్ మాటలు చెప్తూ ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తుందన్నారు. ఆ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు గెలవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:గ్రేటర్ పోరు: కుత్బుల్లాపూర్లో ఉద్రిక్తత.. ఎస్సైకి గాయాలు