కరీంనగర్‌కు వచ్చే ఏ పోలీస్ అధికారి శాశ్వతం కాదని..వారు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలే శాశ్వతమని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కమాన్‌కూడలి నుంచి నాకా కూడలి వరకు ఏర్పాటు చేసిన 131 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. తాను సీపీగా బాధ్యతలు తీసుకున్ననాడు కరీంనగర్‌లో కేవలం 35సీసీ కెమెరాలు మాత్రమే ఉండేవని ఇప్పుడు ఆ సంఖ్య 3వేలకు చేరుకుందని పేర్కొన్నారు.
పనే శాశ్వతం అధికారులు కాదు : సీపీ కమలాసన్ రెడ్డి - karimnagar cp kamalasanreddy
దేశంలో కరీంనగర్ నాలుగో సురక్షిత నగరాల జాబితాలో ఉందని నగర సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. కమాన్‌కూడలి నుంచి నాకా కూడలి వరకు ఏర్పాటు చేసిన 131 సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కదలికలు 50కెమెరాల్లో నమోదు అవుతున్నాయని ఆ సంఖ్య 200కు చేరితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సీపీ పేర్కొన్నారు. దేశంలో నాల్గవ సురక్షిత నగరాల జాబితాలో కరీంనగర్ ఉందని మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేసి నగరం ర్యాంకును మరింత వృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. రాత్రి వేళల్లో సీసీ కెమెరాలను ఎట్టి పరిస్థితిలోనూ ఆఫ్ చేయవద్దని..అలా చేస్తే కెమెరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండన్నారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: దుర్భర స్థితిలో విద్యా వాలంటీర్లు, వంట వాళ్లు..