తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశమంతా ఏకమై కరోనాపై పోరాడుతోంది: సీపీ కమలాసన్ రెడ్డి - తెలంగాణ వార్తలు

కరీంనగర్​లో ఆర్‌ఎస్ఎస్ సేవా భార‌తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీపీ కమలాసన్ రెడ్డి ప్రారంభించారు. ఈ విపత్కర కాలంలో దేశమంతా ఏకమై మహమ్మారిపై పోరాటం చేస్తోందని అన్నారు. సేవా భారతి కార్యక్రమాలను ఆయన కొనియాడారు.

cp kamalasan reddy, blood donation in karimnagar
కరీంనగర్​లో రక్తదాన శిబిరం, కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి

By

Published : May 2, 2021, 12:46 PM IST

కరోనా వంటి విపత్కర ప‌రిస్థితుల్లో దేశ ప్ర‌జ‌లంతా ఏక‌మై మహమ్మారిపై పోరాటం చేస్తున్నార‌ని కరీంనగర్ సీపీ క‌మ‌లాస‌న్ రెడ్డి అన్నారు. అంద‌రం క‌లిసి పోరాడితేనే మహమ్మారిని నివారించ‌గ‌ల‌మ‌ని ఆయ‌న అన్నారు. ర‌క్త‌ం కొర‌త‌ను నివారించ‌డానికి ఆర్‌ఎస్ఎస్ సేవా భార‌తి ఆధ్వ‌ర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నగరంలోని ఓ ఈఎన్‌టీ ఆస్ప‌త్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు.

ఈ ఆపద కాలంలో సేవా కార్య‌క్ర‌మాల‌ను, ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్న సేవాభార‌తిని ఆయ‌న అభినందించారు. ఈ శిబిరంలో 50మంది ర‌క్త‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.ఎస్.ఎస్ క‌రీంన‌గ‌ర్ విభాగం, జిల్లా సంఘ‌చాల‌క్ చ‌క్ర‌వ‌ర్తుల ర‌మ‌ణాచారి, జిల్లా రెడ్​క్రాస్ కార్య‌ద‌ర్శి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి తదిత‌రులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం?

ABOUT THE AUTHOR

...view details